Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అత్యంత అరుదైన వ్యాధి నాకు సోకింది: గుండెలను పిండేస్తున్న నటుడు ఇర్ఫాన్ ఖాన్ పోస్ట్!

  • విలక్షణ నటనతో సినీ అభిమానులకు దగ్గరైన ఇర్ఫాన్ ఖాన్
  • అరుదైన వ్యాధి సోకిందని డాక్టర్లు తేల్చారన్న ఇర్ఫాన్
  • కానీ దానికి తలవంచబోనని వెల్లడి
  • ఓదార్పు మెసేజ్ లు పెడుతున్న అభిమానులు
పలు భారతీయ భాషల్లో నటించి, తన విలక్షణ నటనతో సినీ ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఓ అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ విషయాన్ని ఇర్ఫాన్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. గత 15 రోజులుగా తాను వణికిపోతున్నానని ఓ రేర్ డిసీజ్ తన శరీరంలో ఉందని డాక్టర్లు తేల్చారని చెప్పాడు. తనకున్న రుగ్మతపై అభిమానులు ఎవరికి తోచినట్టు వారు ఊహించుకోవద్దని, మరో వారం పది రోజుల్లో ఈ రోగం గురించిన మొత్తం విషయాన్ని వెల్లడిస్తానని, తనకు మేలు కలగాలని కోరుకోవాలని విజ్ఞప్తి చేశాడు.

కొన్నిసార్లు నిద్రలేవగానే దిగ్భ్రాంతి చెందే విషయాలు వినాల్సి వస్తుందని, కొంతకాలం నుంచి సస్పెన్స్ స్టోరీగా సాగిన తన జీవితంలో పెను మార్పు వచ్చిందని అన్నాడు. విభిన్నమైన కథలను ఎంచుకునే తనకు అటువంటి వ్యాధే సోకిందని, ఈ రోగానికి తలవంచే పరిస్థితి లేదని, పోరాడి తీరుతానని ఇర్ఫాన్ ఖాన్ చెప్పాడు. దీన్నుంచి బయట పడేందుకు తన కుటుంబం, స్నేహితులు మార్గాన్వేషణ చేస్తున్నారని చెప్పాడు. ఇక ఇర్ఫాన్ పోస్టును చూసిన అభిమానులు బాధతో ఓదార్పు మెసేజ్ లు పెడుతున్నారు.
Irfan Khan
Rare Desege

More Telugu News